శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 64 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంలో భాగంగా ఏర్పేడు టౌన్ లో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నిర్వహించారు. టౌన్ లో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ ని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారిని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తు కి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఏర్పేడు పేరుకే మండల కేంద్రం అభివృద్ది శూన్యం, రెండు హైవే లు ఏర్పేడు మీదుగా వెళ్తున్నా కనీసం రోడ్లు బాగా లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, అస్సలు అభివృద్ది లేదని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిరణ్ కుమార్ రామీసెట్టి, ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, లోక రాయల్, ప్రధాన కార్యదర్శులు నితీష్ కుమార్, వెంకట రమణ యాదవ్, సురేంద్ర, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com