గుంటూరు ( జనస్వరం ) : పాత గుంటూరు చూట్టూ పక్కల ప్రాతంలో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సెక్షన్ ఉన్నత అధికారి గారి దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్ళడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా సమస్య గురించి అధికారులను నిద్ర మేల్కొనేలా చేశారు. ఒకానొక సమయంలో వాటర్ డిఈ గారితో జనసేన పార్టీ తరుపున వాదన చేయటం కూడ జరిగింది. సమస్య పరిష్కారించాలని పన్నులు కట్టే ప్రజలకీ త్రాగటానికీ గుక్కెడు మంచి నీరు కూడా ఇవ్వరా ? అంటూ నిలదీశారు. నీరు ఇవ్వనీ పక్షంలో గుంటూరు మున్సిపాలిటీ ముట్టడికీ కూడా జనసేన పార్టీ జెండాతో వెనక్కి తగేదే లేదు అని అధికారులతో మాట్లాడటం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కూడ మాట్లాడి త్రాగునీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరిగింది. కొత్త వాటర్ పేపు లేను కలెక్షన్ ఏర్పాట్లు చేసి త్రాగు నీటి సమస్య లేకుండా సమస్య పరిష్కరించిన వాటర్ డిఈ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు దార్ల మహేశ్ ముఖ్య పాత్ర వహించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com