– వైసీపీ ప్రభుత్వంపై యువత తిరగబడడం ఖాయం
– ఆ తిరుగుబాటుకు జనసేన యువశక్తి సభతో బీజం పడుతుంది
– యువత భవితే లక్ష్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం
– 12న రణస్థలంలో జనసేన యువ ప్రణాళిక
– పవన్ కళ్యాణ్ విజన్ ప్రకటిస్తారు
– యువతకు దిశానిర్ధేశం చేస్తారు
– పవన్ కళ్యాణ్ ప్రకటన రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి అవుతుంది
– జనసేన ఆవశ్యకతను ఖచ్చితంగా తెలియచేస్తుంది
– జనసేనకు మద్దతిస్తేనే పాలకొండ నీటి ప్రాజెక్టులకు పట్టిన గ్రహణం వీడుతుంది
– జనసేనపార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్
మంగళగిరి, (జనస్వరం) : దశాబ్దాల తరబడి పాలకుల దాష్టికాలకు ఉత్తరాంధ్ర యువత బలైపోయారని.. వారి రాజకీయ క్రీడలో పావులుగా మాత్రమే మిగిలిపోయారని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గిరిజనుల్ని, వెనుకబడిన కులాల ప్రజలను కేవలం ఈ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని మండిపడ్డారు. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. యువత జీవనోపాధి కోసం సుధూర ప్రాంతాలకు వలసలు పోక తప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాష్టికాలు మరీ పెరిగిపోయాయి. పాలకుల దాష్టికాలు తట్టుకోలేని పరిస్థితుల్లో వారి మీద తిరుగుబాటుకు ఉత్తరాంధ్ర యువత సిద్ధమవుతున్నారు. జనసేన యువశక్తి సభ ఆ తిరుగుబాటుకు బీజం వేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో యువశక్తి సన్నాహక శిభిరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత భవితకు బాటలు వేసే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. ఇదే శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫానుకు అతలాకుతలం అయినప్పుడు గ్రామ గ్రామాన పర్యటించి యువత వేదనను గ్రహించారు. ఆ రోజు వీరికి కావాల్సింది 25 కేజీల బియ్యం కాదు.. 25 సంవత్సరాల భవిష్యత్తు అని నిర్ణయించుకున్నారు. అందుకే సుధీర్ఘ రాజకీయ ప్రస్థానానికి సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ఈ నెల 12వ తేదీ రణస్థలంలో జరగనున్న యువశక్తి సభలో ఓ బృహత్తర ప్రణాళిక ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ తన విజన్ ఆవిష్కరిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి యువశక్తి సభకు మద్దతు తెలపాలి. అదే వేదిక మీద 100 మంది యువతకు గళం విప్పే అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యువశక్తి సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ చేసే ప్రకటన రాష్ట్ర భవిష్యత్తుకు.. యువత భవిష్యత్తుకు ఓ దిక్సూచి అవుతుంది. రాష్ట్ర భవిష్యత్తుకు జనసేన పార్టీ ఆవశ్యకత ఏంటో తెలియచేస్తుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి యువత పోరాటం మొదలు కావాలి. దశాబ్దాల తరబడి ఉత్తరాంధ్ర ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యింది. పాలకొండ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో గర్బిణి స్త్రీలు డోలీల మీద ఆధారపడుతుండడం పాలకుల మోసానికి పరాకాష్ట. కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడో కొండ మీద ఉన్న ఇంటికి కూడా వాహనం వెళ్లే ఏర్పాటు ఉంటుంది. మన గిరిజన ప్రాంతాలకు కాలినడక కూడా కష్టమే. మన నియోజకవర్గంలో తోటపల్లి కాలువ ఆధునీకరణ పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. జంపరకోట రిజర్వాయర్ ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కాలంగా ఊగిసలాట మధ్య కొట్టుమిట్టాడుతుంది. నాడు రూ. 2 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు రూ. 25 కోట్లకు చేరింది. ఇప్పటికీ దారీ తెన్నూ లేదు. భామిని కొండలోయగడ్డ రిజర్వాయర్ దశాబ్దకాలంగా మూలుగుతోంది. రైతులు నీరందక నానా పాట్లు పడుతుంటే ఎన్నికలు వచ్చినప్పుడు పూర్తి చేసేస్తాం అంటారు. సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ఈ ప్రభుత్వం రైతుల కోసం రూ. 25 కోట్లు ఎందుకు ఖర్చు చేయదు? కిమ్మి – రుషింగి వంతెన పదేళ్లుగా నిర్మాణం నడుస్తూనే ఉంది. ఒక్క పిల్లర్ వేస్తే పూర్తయ్యే పనిని సాగదీస్తూనే ఉన్నారు. ప్రజలు నది మీద ఇంకా ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తూనే ఉన్నారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి ఒక్కటే సమాధానం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. ఆ దిశగా యువత అడుగులు వేయాలి. యువశక్తిని జయప్రదం చేయడం ద్వారా మీరంతా జనసేన వెనుక ఉన్నారన్న సంకేతం పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రియాంక, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు (ఎస్ఎన్ఆర్), సీనియర్ నాయకులు కొండలరావు, పాలకొండ ఇంచార్జీ సత్తిబాబు, మంగళగిరి పట్టణం సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.