
రాజంపేట అర్బన్ ( జనస్వరం ) : రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ప్రముఖ ఎన్నారై సభ్యులు కొట్టే విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 25 జనసేన ప్రచార వాహనాలను రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్ మరియు తెలుగుదేశం పార్టీ రీఛార్జ్ పద్యాల చెoగల రాయుడు ల చేత ప్రారంభించినారు. ఈ ప్రచార రథయాత్రతో వైసీపీ గుండెల్లో గుబులు మొదలైందని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు లు పేర్కొన్నారు. బుధవారం యల్లమ్మ ఆలయం వద్ద గల జనసేన పార్టీ కార్యాలయం నుంచి 25 వాహనాలు తో రథయాత్ర ను బత్యాల, దినేష్ లు జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా జనసేన పార్టీ కార్యాలయంలో అతికారి దినేష్ బత్యాలను శాలువాతో ఘనంగా సన్మానించి శ్రీ వేంకటేశ్వరుడి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా బత్యాల, దినేష్ లు మాట్లాడుతూ మచిలీపట్నానికి చెందిన కొట్టే ఉదయ్ భాస్కర్ సోదరులు తమ సొంత నిధులతో ఈ వాహనాలను ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూలలకు పంపి జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలుతో పాటు టీడీపీ, జనసేన ఉమ్మడి లక్ష్యం, కార్యాచరణను జనాలలోకి తీసుకువెళ్లేందుకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొట్టే సోదరులు చేస్తున్న కృషి అనందనీయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనను, దౌర్జన్య కాండను ఎండగట్టేందుకు ఈ రథయాత్ర దోహదపడుతుందని తెలిపారు. ఉమ్మడి పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడి రానున్న ఎన్నికలకు నేటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అవినీతి పాలనను అంతమొందించి టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకు స్వర్ణమయమైన పాలనను అందించేందుకు ఇరు పార్టీలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.