Logo
Date of Publish : 04 March 2023, 3:55 pm
Editor : Sake Naresh

ప్రజల మీద నిఘా పెట్టి కక్ష కడుతున్న వైసీపీ ప్రభుత్వం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

            నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 292వ రోజున 46వ డివిజన్ వేమగుంట వారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు, అరాచకాలకు నిలయంగా మారిందన్నారు. ప్రజాదరణను రాష్ట్రాభివృద్ధిని చూపి పొందాల్సిన ప్రభుత్వం, నిత్యం ప్రజలను భయాందోళనలకు గురి చేసి అదుపులో పెట్టుకోవాలని చూస్తోందని అన్నారు. ఇంటికొక వైసీపీ వాలంటీరుని పెట్టి ప్రజల మీద నిఘా పెట్టి ఎవరైనా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని అన్నారు. గతేడాది జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన మంగళగిరి ఇప్పటం గ్రామస్తులను ఇప్పటికి కూడా వేధిస్తున్నారని, నేడు కూడా వారి ఇళ్ళను రోడ్డు వెడల్పు పేరుతో కూల్చే పన్నాగాలకు దిగారని అన్నారు. ఇప్పుడు జనసేన సభకు స్థలం ఇస్తున్న మచిలీపట్నం వాసులను బెదిరించే ప్రక్రియ ఇదని అన్నారు. ప్రజలపైనే కక్ష కడుతున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ యావత్తు ఇప్పటికే వణికిపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారంతా రాబోయేది పవనన్న ప్రభుత్వమే అనే విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com