పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ వైసిపి నాయకులు తగలపెట్టినందుకు వారికి వ్యతిరేకంగా పత్తికొండ టౌన్ నందు అంబేద్కర్ సర్కిల్ నుంచి నాలుగు స్తంభాల దగ్గర వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మొదట పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చోట పసుపు నీళ్లు చల్లి తదనంతరం పవన్ కళ్యాణ్ గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సీజీ రాజశేఖర్ మాట్లాడుతూ 30వేల మందికి పైగా మహిళలు కనపడకుండా పోయారని కేంద్ర నిఘావర్గాల సమాచారాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు వివరిస్తే, ఆ అంశానికి వివరణ ఇవ్వలేని, సమీక్ష జరపలేని పనికిమాలిన వైసీపీ ప్రభుత్వం.. నేడు వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తల చేత ఆందోళనలు చేయిస్తుందన్నారు. వాలంటీర్లు పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీకోసం మీ భవిష్యత్తు కోసమే అని మీకు తెలియజేస్తున్నామని అన్నారు. మీ వాలంటీర్లు పేరుతో డేటాను సేకరించినట్లు కేంద్రం నిఘవర్గాలు తెలియజేస్తున్నాయి అన్నారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న మీరు అర్థం చేసుకోవాల్సింది వాలంటీర్ వ్యవస్థకి కూడా చెప్తున్నా.. మీరందరూ తప్పు చేశారు అని పవన్ కళ్యాణ్ గారు అనలేదు, కొంతమంది చెయ్యటం వల్ల మిగతావారికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇది ప్రతి ఒక్క వాలంటరీకి తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పెద్ద పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. అలాగే మీరు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com