పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండ బైపాస్ నందు మోడల్ స్కూల్ నందు టీచర్లను నియమించాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సిజి రాజశేఖర్ ధర్నా చేశారు. సిజి రాజశేఖర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి ఏపీ మోడల్ స్కూల్ నందు సరైన టీచర్స్ లేక విద్యార్థులు జీవితాలు సర్వ నాశనం అవుతున్న పట్టించుకోని ఈ వైసీపీ ప్రభుత్వం, నాడు నేడు కింద స్కూల్లో ఇలాంటి సమస్యలు లేవు ప్రతి స్కూలు అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి రంగులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులకు సరైన విద్య అందించే టీచర్స్ ను నియమించాలని బుద్ధి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సీఎం గారు విద్యార్థులంటే ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఈ స్కూల్లో ఉండే టీచర్లను బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవ్వవలసింది అమ్మఒడి కాదు పిల్లలకు సరైన విద్య అందించే మంచి ఉపాధ్యాయులు ఇవ్వాలని అన్నారు. ఈ చేతకాని సీఎంగారు పిల్లలకు మావయ్య అని చెప్పించుకోవడానికి సరిపోతాడు అంతేగాని పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలని చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు,.ఈ ప్రభుత్వ పరిపాలనలో పేరుకు మాత్రమే ప్రభుత్వం కాని చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో టీచర్స్ ని నియమించాలన్న ఇంకిత జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. అలాగే ఈ ధర్నా విరమించడానికి ప్రధాన కారణం పత్తికొండ ఎంఈఓ మస్తాన్ వలి. గారు ఈ స్కూళ్లకు ఒక నెల రోజుల లోపల టీచర్స్ TGT MATHS, PGT MATHS, PGT BOTANY, PGT ZOOLOGY, COMPUTER TEACHER, Office staff, Junior assistant, Data entry operator అందరిని నియమిస్తామని మీరు ధర్నా విరమించుకోవాలని హామీ ఇవ్వడంతో ధర్నా తాత్కాలికంగా విరమించుకుంటున్నాం. మరో నెల రోజుల లోపల ఈ స్కూల్ నందు టీచర్ నియమించకుంటే కలెక్టరు ఆఫీస్ను ముట్టడిస్తాం అలాగే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసు ను ముట్టడిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అభిరామ్, వడ్డే వీరేష్, రమేష్, గద్దల రాజు, చిరంజీవి, నాగేశ్వరరావు, హరి రాముడు, ఈశ్వరయ్య, వెంకట్రాముడు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.