Logo
Date of Publish : 08 November 2022, 2:36 pm
Editor : Sake Naresh

పిచ్చి మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం

● పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 176వ రోజున 42వ డివిజన్ ఖుద్ధూస్ నగర్ 4వ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ తామొస్తే రాష్ట్రంలో ఎక్కడా మద్యం దొరక్కుండా మద్యనిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పిచ్చి మద్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో దొరికే మద్యం త్రాగే వారిలో అనారోగ్య సమస్యలు అధికం అవుతున్నాయని, అనేక చోట్ల ఈ మద్యానికి బానిసైన వారు పలువురు రాత్రులు గుండె పెట్టేసి నిద్రలోనే చనిపోయిన ఉదంతాలు ఉన్నాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీను అమలుచేయకుండా ఇలా ప్రజల ప్రాణాలను హరిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఇలాంటి ఎక్సైజ్ పాలసీ ఉండదని, ఏరులై పాడుతున్న పిచ్చి మద్యానికి చరమగీతం పాడి మద్యపాన నియంత్రణ విధానాలు తీసుకొస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com