కొండపల్లి, (జనస్వరం) : ప్రజాసమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కొండపల్లి మునిసిపాలిటీ జనసేన పార్టీ కార్యకర్త సిరిపురం సురేష్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ కొత్తగేటు గ్రామంలో 27వ వార్డుకు సంబంధించిన డ్రైనేజీ కాలువ గత మూడు నుంచి నాలుగు నెలలుగా పూడిక తీయలేదు. దీని వల్ల విష జ్వరాలు ప్రభలడమే గాక ఇంట్లోకి దోమలు ఈగలు వస్తున్నాయని, చాలా ఇబ్బందికి గురవుతున్నామని స్థానికంగా ఉన్న నివాసితులు తెలియజేశారు. విషయం తెలుసుకుని మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసి పారిశుధ్య కార్మికులతో దగ్గర ఉండి పూడిక తీయించినట్లు తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com