శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రాచగున్నెరి పంచాయతీ, కోళ్ల ఫారం, ఏర్పేడు మండలం ,మేర్లపాక పంచాయతీ, కొత్త కండ్రిగ, గ్రామాలలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. గ్రామంలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి,అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో మౌలిక వసతులు అస్సలు లేవు, సి సి రోడ్డు కూడా వేయలేదని, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం అస్సలు లేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని వినుత గారు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, జనసైనికులు అశోక్, నాయకులు, తోట గణేష్, కావలి శివకుమార్, పేట చంద్ర శేఖర్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, సురేష్, రాజేష్, గురవయ్య, జ్యోతి రామ్, హేమంత్ గౌడ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com