Logo
Date of Publish : 12 July 2022, 3:06 pm
Editor : Sake Naresh

ప్రజల ఆరోగ్యం పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం : చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత

    మదనపల్లి, (జనస్వరం) : మదనపల్లి పట్టణంలో 2 లక్షల 30 వేల వరకు జనాభా ఉండగా వీరికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామారావు కాలనీలోని కేంద్రానికి మాత్రమే సొంత భవనం ఉండగా మిగిలినవన్నీ అద్దే భవనాల్లో నడుస్తున్నాయి. అన్నింటిలోనూ సూపర్వైజర్ లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కో కేంద్రానికి 40 నుండి 50 మంది రోగులు వైద్య సేవ నిమిత్తం వస్తుంటారు. రామారావు కాలనీ కేంద్రంలో మాత్రమే మందులు అందుబాటులో ఉండగా మిగిలిన కేంద్రాల్లో రక్త పోటు మాత్రలు మధుమేహ వ్యాధికి వినియోగించే గ్లిమిప్రైడ్ 2 ఎంజీ మాత్రలు అందుబాటులో లేవు. దీనిపై పట్టణ ఆరోగ్య కేంద్రాల జిల్లా మోడల్ అధికారి డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పరిస్థితిలో మాత్రం నేటి వరకు మార్పు లేదు. రాజంపేట పరిధిలో ఉస్మాన్ నగర్లో అద్దె భవనంలో నడుస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కొత్తగా వైద్య పరికరాలు వచ్చినా వాటిని బిగించడానికి నిధులు సమస్య నెలకొందని పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా అద్దె విద్యుత్తు చార్జీల సైతం చెల్లించలేని దయనీయస్థితిలో ఉంది. ఈ విధంగా పేరుకే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో సరైన మందులు గాని సిబ్బంది గాని, పరికరాలు కానీ లేకపోవడం అనేది ప్రజల యొక్క ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని వెంటనే ప్రజలకు అందుబాటులో వైద్యులను, వైద్యాన్ని ఉంచాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని దారం అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com