నర్సిపట్నం ( జనస్వరం ) : న్యాయ పోరాటానికి భరోసా కోరిక తీర్చలేదన్న అక్కసుతో ఓ నిరుపేద మహిళ ఇంటిని కూల్చేశాడో వైసీపీ నాయకుడు. నర్సిపట్నం నియోజకవర్గం, గొలుగొండ మండలం, కొత్త ఎల్లవరం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచనలం సృష్టించింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన నాయకులు రాజాన వీర సూర్యచంద్ర., బాధిత మహిళను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిరుపేద అయిన సదరు మహిళకు కొంత మొత్తం ఆర్ధిక సాయం, 50 కేజీల బియ్యం జనసేన పార్టీ తరఫున అందచేశారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ.. కన్నూరు సత్తిబాబు అనే వైసీపీ నాయకుడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్టు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం అని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతుంటే., ఆ పార్టీ నాయకులు అదే నిరుపేదల ఇళ్లు కూలుస్తున్నారని మండిప్డారు. నిరుపేద మహిళ ఇళ్లు కూల్చేయడం అన్యాయమన్నారు. అధికార పార్టీ నాయకుల దాష్టికానికి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం మద్దతు పలకడాన్ని తప్పుబట్టారు. ఇంటిపన్నులు, విద్యుత్ బిల్లులు ఉన్న ఇంటిని ఎలా కూలుస్తారని నిలదీశారు. బాధితురాలికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఎలా కూలుస్తారని అడిగారు. స్థానిక శాసనసభ్యుడు స్పందించి బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని లేని పక్షంలో జనసేన పార్టీ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గండెం దొరబాబు, రేగుబళ్ల శివ, లోకారపు అప్పారావు, లోవబాబు, ఇండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com