ఆచంట : టిడిపి, జనసేన కూటమితోనే దళితుల సంక్షేమం, అభివృద్ధి అని ఇరు పార్టీల ఎస్సీ నాయకులు అన్నారు. మండలం లోని పెనుమదం గ్రామంలో మంగళవారం జగన్ ప్రభుత్వంలో రద్దయిన 27 సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నాలుగున్నర సంవత్సరాల పాలనలో అడుగడుగునా దళితులను దగా మోసం చేసిందన్నారు. దళితులకు అమలు జరిగే 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిందని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ తానేటి బాబురావు, దాసరి రత్నరాజు, జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్,కోటి మధుసూదన్, వడ్లపాటి మోహన్ రంగా, ముత్తబత్తుల దొరబాబు, పసుపులేటి జేమ్స్, తోట వెంకటేశ్వరరావు, దేవరపు దొరబాబు కడలి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.