Logo
Date of Publish : 09 September 2022, 3:49 pm
Editor : Sake Naresh

పామిడి పట్టణ ప్రజల నీటి కష్టాలను వెంటనే తీర్చాలి : జనసేన నాయకులు యం.ధనుంజయ

        పామిడి ( జనస్వరం ) : గత 15 రోజులకు పైగా పామిడి పట్టణంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవడం లేదు. సత్యసాయి వాటర్ పామిడి నుంచి గుత్తి గుంటకల్ ప్యాపిలి ఇలా అన్ని పట్టణాలకు నీటిని సరఫరా చేస్తోంది.  పామిడి పట్టణ ప్రజలకు మాత్రం ఎందుకు అందించలేకపోతోందని పామిడి జనసేన మాండ్ల అధ్యక్షులు యం. ధనుంజయ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై స్పందించి కనీసం సత్యసాయి వాటర్ నైనా పామిడి పట్టణ ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందించాలి. వర్షాలు పడితే చాలు మోటార్లు పోయాయి అనే కారణంతో పామిడి పట్టణంలో నీటి సరఫరాను ఆపివేస్తున్నారు. ఎందుకు వర్షాలు పడిన ప్రతిసారి మోటర్లు పోతున్నాయి. అలా మోటర్లు కాలిపోకుండా తగిన చర్యలు ఎందుకు ప్రభుత్వాలు చేపట్టలేకపోతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. దయచేసి ప్రభుత్వం వారు ఇకనుంచి అయినా తాగునీటి సమస్య లేకుండా చూడాలని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాము. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలతో కలిసి తీవ్ర నిరసనలు తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాము. దయచేసి అధికారులు ప్రజల కష్టాలను ఇక్కట్లను నీటి ఎద్దడిని గ్రహించి సత్వరం పట్టణ ప్రజలకు నీటి సమస్యను తీర్చవలసిందిగ పంచాయతీ కార్యాలయంలో BV Shesikala...(EORD) గారికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రాన్ని అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో  జనసేన మండల ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, షేక్షావలి, జనసేన పార్టీ పామిడి మండల కార్యదర్శులు ఖాజావలి, లాలూ స్వామి, రోషన్ జమీర్, అబ్దుల్ సత్తార్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com