సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామం నందు 11వ రోజు శనివారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ చవటపాలెం గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి 30 కుటుంబాలకి తాగునీరు అందక ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. మండల స్థాయి అధికారుల దగ్గరికి ఎన్నోసార్లు వెళ్లడం వాళ్లకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ గ్రామస్తుల సమస్య మాత్రం ఇప్పటివరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి. అయితే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి అక్కడికి వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకొని వెంటనే స్థానిక సచివాలయ సిబ్బంది కి పంచాయతీ సెక్రెటరీ తెలియజేశారు. AE గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మండల ఎంపీడీవో మేడం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. ఈ సమస్యని వారం రోజుల లోపల పూర్తిస్థాయిలో పరిష్కారం చేయకపోతే జనసేన సొంత నిధులతో వాళ్లకి కొత్త పైపులైను వేయించి వాళ్లకు తాగునీరు అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇవడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి తాగునీరు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటే పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు మీకు పట్టవా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం చవటపాలెం గ్రామం, 13 వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి సొంత గ్రామం. మరి ఆ గ్రామంలో 30 కుటుంబాలకి తాగునీరు లేక గత 4సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే ఎందుకని ఈ అధికార పార్టీకి సంబంధించిన వారు వాళ్ళ సమస్యను పరిష్కరించలేదు. మంత్రి గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రజలు తమ సమస్యలు తెలియజేస్తే మరి ప్రజా సమస్యలు అంటే ఎందుకు? నిర్లక్ష్య త్వరితగతిన వాళ్ళకి తాగునీరు సమస్యకి పరిష్కారం జరగాలి. అలా జరగని పక్షంలో జనసేన పార్టీ బలంగా నిలబడి సమస్య పరిష్కరించే అంతవరకు పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, ఖాజా, నవీన్, సాయి, వంశీ, తదితరులు పాల్గొన్నారు.