Logo
Date of Publish : 24 April 2026, 8:41 am
Editor : Sake Naresh

ప్రగతి పథాన పల్లె రథం – జననేత పవన సంకల్పం

పాలనలో పారదర్శకత... మార్పుకు అది తొలి సంతకం

గ్రామమే దేశానికి వెన్నెముకన్న గాంధీజీ కల కోసం,
పంచాయతీకి ప్రాణం పోయగ వచ్చాడు ఓ జననేత,
ఆయనే మన " కొణిదల శ్రీ పవన్ కళ్యాణ్" అన్న - ప్రజాసేవలో నవదూత.

పంచాయతీ రాజ్ వ్యవస్థలో పురుడుపోసిన సరికొత్త వేగం,
రేపటి సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మూలరాగం,
గ్రామ స్వరాజ్యం వైపు సాగుతున్న ఈ ప్రయాణం,
సగర్వంగా చాటుదాం... ఇది ప్రజా ప్రస్థానం.

అధికారం అంటే అహంకారం కాదు - అది బాధ్యతని చాటిన వేళ,
పంచాయతీ గుమ్మం ముంగిట... ఒక కొత్త వెలుగు ఉదయించిన వేళ,
నిధులన్నీ నీళ్లలా మళ్లిన చోట... ప్రగతికి అడ్డుకట్ట పడిన వేళ,
తానొక సైనికుడై నిలబడ్డాడు - పల్లె కన్నీరు తుడిచే కవచమై.

"గ్రామ సభ"  అంటే కేవలం సమావేశం కాదు... అది ప్రజాస్వామ్య పండుగ,
ప్రతి పౌరుడి గొంతుక వినిపించే... ఒక చైతన్య గుడి అని నిరూపించి,
ఒక్క రోజే వేల గ్రామ సభలు జరిపించిన ఆ 'నాయకత్వ పటిమ',
గ్రామ స్వరాజ్య సాధనలో... అది ఆంధ్ర చరిత్రలో అలుపెరగని గరిమ.

గ్రామ పంచాయతీలే రాష్ట్రానికి... అసలైన శక్తి అని చాటిన రీతి,
వచ్చాడు జనసేనాని... పల్లె కష్టాలను తీర్చే సంకల్పంతో,
అడుగడుగునా నిలుస్తున్నాడు లోక కల్యాణానికి... " కొణిదల పవన్ కళ్యాణ్ " అనే నామంతో.

"అడవి తల్లి బాట"
కొండకోనల్లోని "గిరిజన" గుండెల్లో... కొత్త ఆశల దీపం వెలిగించి,
దారి లేని చోట "తారు రోడ్లు, సిమెంటు రోడ్లు" వేసి... అడవి బిడ్డల కష్టాన్ని కడతేర్చి,
నిర్లక్ష్యానికి గురైన గిరిజన పల్లెలకు... ప్రగతి బాటలు పరిచిన వేళ,
జననేత అడుగులో అడుగు కలిపి - ఆంధ్రావని పులకించిన వేళ.
గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో సుమారు 460 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించి అడవి బిడ్డల కష్టాలను తీర్చారు.

​'అమరజీవి జలధార' తో ప్రతి గొంతుకూ... స్వచ్ఛమైన నీటి ధారలు,
ఎండిన గొంతుల్లో తడారిపోని... ఆనందపు చిరు జల్లులు,
దాహం తీర్చే దేవదూతగా... తాగునీటి వ్యవస్థకు ప్రాణం పోసి,
మౌలిక వసతుల కల్పనలో... సరికొత్త రికార్డులే తిరగరాసి.

వరుణుడి కరుణ కోసం వేచి చూడక... 'ఫామ్ పాండ్స్' సాగు నీటి వరాలు,
పంటకుంటలతో రైతు ముఖాన... నిరంతరం పచ్చని సిరి వెలుగులు,
నేలతల్లిని నమ్ముకున్న అన్నదాతకు... కొండంత అండగా నిలిచి,
వ్యవసాయాభివృద్ధిని తన శాఖకు... పర్యాయపదంగా మార్చి.

గోమాతను పూజించే సంస్కృతికి... 'మినీ గోకులాల' తో జీవం పోసి,
పాడిపంటల వికాసానికి... సనాతన ధర్మమే బాటగా చేసి,
శాఖ ఏదైనా... లక్ష్యం మాత్రం ఒక్కటే - అది రాష్ట్ర ప్రగతి,
పవన్ కళ్యాణ్ పాలనలో... వెలుగుతోంది ఆంధ్ర రాష్ట్ర సువర్ణ గతి.

​'పల్లె పండుగ' సంబరంతో పల్లెల్లో ప్రగతి కాంతులు పూయించి,
పల్లెపండుగ 1.O ఈ కార్యక్రమం కింద సుమారు 4,000 కిలోమీటర్ల మేర వివిధ రకాల రోడ్లు (సిమెంట్ మరియు బిటి) నిర్మించారు.

పల్లెపండుగ 2.O ఈ కార్యక్రమం ద్వారా మరో 8,500 కిలోమీటర్లకు పైగా కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

బుల్లెట్ వేగంతో అభివృద్ధిని ఇంటింటికీ చేరవేసి,
'మ్యాజిక్ డ్రెయిన్' విజ్ఞానంతో మురుగు నీటిని మాయం చేసి,
పరిశుభ్రతకు సరికొత్త నిర్వచనాన్ని పల్లె ముంగిట రాసి,

​'అడవి తల్లి బాట' వేసి అడవి బిడ్డల కష్టాలు తీర్చి,
'స్వచ్ఛ రథం' సాక్షిగా పల్లెలను నందనవనాలుగా తీర్చి,
అటవీ శాఖ అండగా... 'వన మహోత్సవ' సంకల్పంతో ప్రకృతిని కాపాడుతున్నాడు... ప్రకృతే ప్రాణవాయువనే లక్ష్యంతో.

'పులుల సంరక్షణ' కోసం ఉక్కుపాదం మోపి,
అటవీ సంపద  'అక్రమ రవాణా'  ను ఉరితాడుతో ఆపి,
'కుంకీ ఏనుగుల'  పహరాతో వన్యప్రాణి ఘర్షణలు నిలిపి,
'పర్యావరణ పర్యాటకం'  తో ప్రకృతి అందాలను ప్రపంచానికి చూపి.

'అంజనీ అమ్మ పుట్టినరోజు' వేళ  రెండు జిరాఫీల దత్తత తో మూగజీవాల పై మమకారం చాటి,

కరుణా హృదయానికి ఆయనే కదా... అసలైన సాటి అని నిరూపిస్తూనే ఉన్నారు.

'డొక్కా సీతమ్మ'  బాటలో ఆకలి తీర్చే అన్నదాతగా మారి,
'స్మార్ట్ కిచెన్'  హంగులతో వంటశాలల రూపురేఖలే మార్చి,
'మాటా-మంతి' తో జనాల గుండె చప్పుడు నేరుగా విని,
ప్రజాస్వామ్య విలువలకు మళ్ళీ ప్రాణం పోసిన మహర్షి.

ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న ప్రతి అడుగు,
ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు... ఒక ధైర్యమైన మలుపు.

గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖల పరిధులు దాటి.. సామాన్యుడి కన్నీటి గడప దాటి,
నిలుస్తున్నాడు  "శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్"... నవ్యాంధ్ర ప్రగతికి అసలుసిసలైన సాటి.

"ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు"...

జైహింద్...

మీ,
వన్నూర్...


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com