పేద విద్యార్థుల విద్యా నిధికి చేయూత, ఫీజుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి.
చీరాల,జూన్ 16( జనస్వరం)
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ కార్యాలయం నందు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆదేశాల మేరకు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అర్హులైన విద్యార్థులకు సౌత్ ఇండియా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కోన వరలక్ష్మి మరియు సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీ పొట్లూరి సత్యవతి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షేక్ ఆసియా (2nd Class): పాఠశాల ఫీజు నిమిత్తం 13,000 వేల రూపాయలు,నూర్ భాషా అజమా (5th Class): పాఠశాల ఫీజు నిమిత్తం 18,000 రూపాయలు, ముప్పా చంద్రిక (Intermediate - MPC): కాలేజీ ఫీజు నిమిత్తం 43,000 రూపాయలను విద్యార్థులకు పంపిణీ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల బాబు,కృష్ణాజిల్లా సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.