గుంటూరు ( జనస్వరం ) : ఉమ్మడి బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి గుంటూరు జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి సోమరౌతు అను రాధ,జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి బాపట్ల జిల్లా వేమూరు నియోజవర్గం కార్యదర్శి సోమారౌతు అను రాధ గారు మాట్లాడుతూ గత నెల 23వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నై వారు ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలు పర్యావరణానికి హాని కలిగేలా జరుగుతున్నాయని వెంటనే నిలుపుదల చేయాలని, మరలా కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని అప్పటివరకు ఇసుక త్రవ్వకాలు జరపకూడదని 18 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులు అండదండలతో ఇష్టారాజ్యంగా ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారని, jaypee అనే ఒక డొల్ల కంపెనీని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వందల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని,ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజవర్గ శాసనసభ్యులు ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించిన ఇసుక త్రవ్వకాల కోసం ముఖ్యమంత్రి గారికి నెలకి 20 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని ఇష్టానుసారంగా నదికి అడ్డంగా రహదారులు నిర్మించి మరి ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారని, దీనివలన పర్యావరణానికి హాని కలగడమే కాకుండా చాలామంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుందని, ఇటీవల 15 రోజుల్లోపు పెదకూరపాడు నియోజకవర్గంలో ముగ్గురు, కొల్లిపర మండలంలో ఒకరు ఇసుక త్రవ్వకాల వల్ల ఏర్పడిన ఆగాదాలలో పడి చనిపోయారని తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తూ ఎన్జీటీ ఆర్డర్ ని అమలు చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ఇసుక రీచ్ ల నుండి ఒక్క లారీని కూడా బయటికి రానివ్వమని హెచ్చరించారు.
రాష్ట్ర నాయుకులు బండారు రవి కాంత్, గల్లా చందు, మతి భాస్కర్ గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక త్రవ్వకాలనీ వ్యాపారంగా చేసుకుని వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ ఇసుక త్రవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన ఆర్డర్ ని అమలు చేయని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని, అవసరమైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇసుకరీచ్ లను సందర్శించి ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపివేయవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజవర్గం నుంచి గోప రాజు ఉదయ్ కృష్ణ,దాసoశెట్టి మహేష్,వైలా నరేష్ యాదవ్,మొహమాట పృథ్వి,జిల్లా సంయుక్త కార్యదర్శి చందోల్లు ప్రసాద్, గొట్టిపాటి శ్రీ కృష్ణ, సురేంద్ర, మరసాని బాలాజీ, కతి నాగలక్ష్మి, కారుమురి ఆంజనేష్, తాoద్ర రాధ కృష్ణ, సాయిని రాంబాబు, వేమూరు నియోజవర్గం నుంచి సో బ్రహ్మం మూల్పుర్ రమేష్, కత్తి కిషోర్ మండల కమిటీ సభ్యులు వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.