అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అశాంతి అలజడుల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి నిరసనగా టీడీపీ వారు చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపారు. వారు చేపట్టబోయే శాంతియుత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపును ఇచ్చిన సంధర్భంగా రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత అనంతపురం జిల్లా మహిళా కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళ్లి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో టీడీపీ వారు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వెళ్లారు. శ్రీలత ని బళ్లారి బైపాస్ కి చేరుకోగానే పోలీసులు చుట్టుముట్టి నియంతృత్వ పోకడలతో అరెస్ట్ చేసి అనంతపురం రూరల్ పోలిష్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వెళుతున్న మమ్మల్ని పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేయడం ఎంతవరకు సబబు కాదని ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ బద్దంగా మద్దతు తెలిపే హక్కు అందరికీ ఉందని అన్నారు. రహదారుల్లో స్వేచ్చగా తిరిగే హక్కును కూడా ఈ వైకాపా ప్రభుత్వం కాలరాస్తుందని వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఇలాంటి మూకుమ్మడి ఉద్యమాలు మరెన్నో చేసి ఈ ప్రభుత్వాన్ని రుపు రేఖలు లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీరమహిళలు శైలజ, లక్ష్మి, శ్రావణి, అశీద ,నాయకులు పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.