Logo
Date of Publish : 17 February 2022, 4:52 pm
Editor : Sake Naresh

గొప్ప నాయకులు అవ్వాల్సిన తరుణమిది : చిత్తూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు డా.హరిప్రసాద్

● అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా ఎదగండి.

● ప్రజలకు సేవ చేయండి.

● జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్.

     గంగాధర నెల్లూరు, (జనస్వరం) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం మండల కమిటి సమావేశం మండల కేంద్రం బోసు అయ్యవారి గార్డెన్ లో నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గొప్ప నాయకులు అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ రాష్ట్రంలో జనసేన మాత్రమే అని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పించిన అవకాశాన్ని ఆకాశమే హద్దుగా ఎదిగి, ప్రతి ఒక్కరూ ఎదిగి ప్రజలకు సేవ చేయాలనీ పిలుపు నిచ్చారు. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలు పగడ్బందీగా అమలు చేయగల నిస్వార్థ నాయకులు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఉద్ఘాటించారు. నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మూడు వేలమంది నాయకులు సిద్దమౌతున్నారని తెలియజేసారు. క్రియా శీలక సభ్యత్వం నమోదు చేసి నాయకులను తయారు చేయాల్సిన భాద్యత ఉందని తెలిపారు. కార్యకర్తలకు అండగా, ప్రజలకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిర్వాహక కమిటీ కో-ఆర్డినేటర్ పగడాల మురళి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు శ్యామల, జిల్లా కార్యదర్శులు భాను ప్రసాద్, వెంకటేష్, రాఘవ, దేవర మనోహర్, కొట్టే సాయి, జయప్రకాష్ రెడ్డి, రవి, ఆరు మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు లోకనాధం నాయుడు, సమన్వయ కర్తలు, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com