Logo
Date of Publish : 07 March 2022, 3:30 pm
Editor : Sake Naresh

వైసిపి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది : అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్

     గుంతకల్లు, (జనస్వరం) :  జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన గుంతకల్ నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు శ్రీ టి.సి వరుణ్ గారికి వీరమహిళలు విజయ, సంధ్య హారతినిచ్చి, నిస్వార్థ జనసైనికులు బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్రియాశీలక సభ్యత్వం, మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లకు గురించి కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని, అలాగే ఈ అసమర్థ వైసిపి ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలు చేస్తూ గుంతకల్ నియోజకవర్గంలోని జనసేన నాయకులు ప్రజలకు చేరువఅవ్వాలని పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క జనసైనికుడు, జనసేన నాయకులు భద్రతా భవితవ్యం గురించి ఆలోచన చేసి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు, కావున జనసేన శ్రేణులు అందరూ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని సమాజానికి, కుటుంబానికి భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు శ్రీ అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, కార్యదర్శి కిరణ్ గారు, సహాయ కార్యదర్శి జీవన్, గుత్తి మండల అధ్యక్షుడు చిన్న వెంకటేశులు, పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ, గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు పాటిల్ సురేష్ మరియు పెద్ద ఎత్తున నియోజకవర్గం జనసేన నాయకులు, నిస్వార్థ జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com