గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక ముబారక్ సెంటర్లో రంజన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరీమణులకు రంజాన్ కానుక మరియు చీరలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు ముబారక్ సెంటర్లో పవిత్రమైన రంజాన్ మాసంలో పేద, గొప్ప తేడా లేకుండా ప్రతి ముస్లిం రంజాన్ పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని ఆలోచనతో ముస్లిం సోదరీమణులకు రంజాన్ కానుక మరియు చీరలు అందజేయడం జరిగిందని అలాగే మనకున్న దానిలో పక్క వారికి కూడా సాయం చేసి కుల మతాలు భేదాలు లేకుండా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, అరుణ, నూనె అయ్యప్ప, గంట అంజి, దివిలి సురేష్, పందిళ్ళ శీను, నాగసాయి, చరణ్, శివ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.