గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక చౌడ్రీపేట రైల్వే గేట్ దగ్గర గత కొన్ని బిక్షటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధ తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు Rk వారియర్స్ జనసైనికులకు తెలియజేసారు. పోలీస్ వారికి సమాచారం అందజేసి ఆ మృతదేహంను అన్ని తమే దహన సంస్కారాలు చేయడం జరిగిందని జనసైనికులు అన్నారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అని నినాదంతో గుడివాడ పట్నంలో ఎలాంటి చావు అయిన పర్లేదు కానీ ఆకలి చావులు ఉండకూడదని ఉద్దేశంతో పట్టణంలో ఆకలితో ఉన్ననార్థులకు ఆకలి తీరుస్తూ… అదేవిధంగా నా అనేవాళ్ళు ఎవరూ లేకపోతే అనాదిగా మరణిస్తే వారికి అన్ని మేమే అంతక్రియలు చేస్తున్నామని తెలియజేశారు. మనం పుట్టినప్పుడు ఎంతో పవిత్రంగా పుడతాం. అదే చివరి దశలో చనిపోయినప్పుడు కూడా అదే పవిత్రతో మట్టిలో కలిసిపోవాలని మా ఆకాంక్షాన్ని తెలియజేశారు అందుకే నా అనే వాళ్ళు లేని వారికి మా టీం అన్ని మేమే వారికి అంత్యక్రియలు చేస్తున్నామని అన్నారు. ఈ వృద్ధ తల్లి కులం తెలియదు, మతం తెలియదు, కానీ మానవుడే మహనీడని మనిషా దైవ స్వరూపమని భావిస్తూ, ఆ వృద్ధ తల్లి మృతదేహానికి అంతక్రియలు చేసి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని తెలియజేశారు. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మరెన్నో సామాజిక సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ, చరణ్, శ్యామ్ బాబాయ్, ఫ్రండ్ సర్కిల్, మరియు ఆర్కే వారియర్స్ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.