Logo
Date of Publish : 13 October 2023, 10:37 pm
Editor : Sake Naresh

అనాధ మృతదేహానికి అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ జనసైనికులు

       గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక చౌదరి పేట రోడ్లో అనారోగ్యంతో వృద్ధురాలు చనిపోవడంతో ఆ వార్డు ప్రజలు గుడివాడ పట్టణ Rk వారియర్స్ కు తెలియజేయడంతో ఆ వృద్ధ తల్లికి అన్ని తామై అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు గుడివాడ చౌదరి పేట వార్డులో ఉంటున్న కట్ట జయమ్మ అనారోగ్యంతో చనిపోవడంతో ఆ వార్డ్ ప్రజలు ఆ సమాచారాన్ని మాకు తెలియజేయగా వెంటనే స్పందించి ఆ వృద్ధతల్లికి అన్నీ మేమే అంతక్రియలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకున్నామని తెలియజేశారు. అదేవిధంగా దైవం మనుష్య స్వరూపమని దేవుడు ఎక్కడో లేడని మనుషుల్లోనే ఉంటారని మనము ఎంత పవిత్రంగా జన్మనిస్తామో అదే పవిత్రంగా చివరి దశలో కూడా వెళ్లాలని మా ఆకాంక్షాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, కిరణ్, శివ, చరణ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com