జగ్గంపేట, (జనస్వరం) : సాంప్రదాయ క్రీడల్లో భాగంగా తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం ద్వారా పల్లెల్లో సాంస్కృతి సాంప్రదాయ క్రీడల ద్వారా ముందు తరాలకు మన సంస్కృతిని అందించే విధంగా తోడ్పడుతుందని తదేకం ఫౌండేషన్ కో ఆర్డినేటర్ మాధవి లత అన్నారు. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో జనసేన నాయకులు బీడీల రాజుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ముగ్గులపోటీ విజేతలకు పట్టుచీరలు తదేకం ఫౌండేషన్ సౌత్ రీజియన్ కో ఆర్డినేటర్ మందలపు మాధవి లత యార్లగడ్డ సాయి సుధా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ చల్లా లక్ష్మి, కడలి ఈశ్వరి జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యధర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, సమ్యుక్త కార్యధర్శి స్వామిని మణి భాస్కర్(బాలు) ముఖ్య అధిదులుగా పాల్గొని విజేతలకు బహూమతుల అందజేసారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి బహుమతి దువ్వాడ కరుణ రెండవ బహుమతి బండారు రాణి మూడవ బహుమతి బీడీల రమ్యకుమారి స్పెషల్ బహుమతులుగా ఉరమళ్ళ అనూష, బండారు భారతి దేవిల కు డ్రెస్ మెటీరియల్స్ అందజేసారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న గంటా కరుణ కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులు దానితో పాటు మూడు నెలల పాటు ప్రతి నెల రూ.2000లు చప్పున మందుల ఖర్చులకు సాయం చేసారు. ఈ కార్యక్రమం జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు పాలిశెట్టి సతీష్, కిర్లంపూడి మండలాధ్యక్షులు ఉలిసి అయిరాజు, కడలి శివ, జానకి మణికంఠ, మేకా జాను మర్రిపాక గ్రామ జనసేన నాయకులు గ్రామ పెద్దలు, మహిళలు, యువత తో పాటు గ్రామ పిల్లలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.