Logo
Date of Publish : 29 October 2023, 7:20 pm
Editor : Sake Naresh

జనసైనికుల పోరాటమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

     గుంటూరు ( జనస్వరం ) : ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ కొనసాగిస్తున్న రాక్షసపాలన నుంచి ప్రజల్ని రక్షించుకునేందుకు జనసైనికులు చేస్తున్న పోరాటమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీనివాసరవుతోటలోని గాజు గ్లాసు దిమ్మె వద్ద బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగాఫ్యామిలీ అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారిని సమాజ సేవకులుగా మార్చిన ఘనత నాగేంద్రబాబుదే అని కొనియాడారు. సినీ రంగంలో అన్న చిరంజీవికి లక్ష్మణుడిలా, రాజకీయ రంగంలో తమ్ముడు పవన్ కల్యాణ్ కు బలరాముడిలా అండగా నాగేంద్రబాబు నిలుస్తున్నారన్నారు. జనసైనికులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వారిని రాజకీయ యుద్ధరంగంలో కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దటంలో నాగబాబు పాత్ర స్ఫూర్తి దాయకమని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, డివిజన్ అధ్యక్షులు గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, యమ్ సునీల్, కోలా అంజి, కోనేటి ప్రసాద్, వడ్డె సుబ్బారావు, బాలు, సాధిక్, బాలాజీ, అలా కాసులు, రేవంత్, మారాసు అన్వేష్ , తాడికొండ శ్రీను , తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com