గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మoడలంలో జనసేన ఇంచార్జ్ Dr యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని పది గ్రామ పంచాయతి లోని సురేంద్ర నగరం హ వా, కొత్త డేరా కండ్రిగ, కొత్త ఇండ్లు, కృష్ణ సముద్రం, మునిరెడ్డి కండ్రిగ, జీలా వారి కండ్రిగ, కృష్ణా పురం హ వా, కేపీ అగ్రహారం, యర్రమరాజుపల్లి, గాజంకి గ్రామాల్లో నిరసన మరియు సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్బంగా యుగంధర్ మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న కార్వేటి నగరం మండలం, తిరుపతి జిల్లాకు పనికిరాదా? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని జనసేన తరపున విజ్ఞప్తి మరియు డిమాండ్ చేస్తున్నానని అన్నారు. నగరాన్ని తిరుపతి మహానగరంలో చేర్చకపోతే సమ్మె ఉధృతం చేస్తామని ఈ సందర్బంగా తెలిపారు. పది గ్రామాల్లో సంతకాల సేకరణ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో కార్వేటి నగరం మండలాన్ని తిరుపతిలో కలిపి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పత్రికా ప్రతినిధుల గ్రూపులో వచ్చిన ఆధారంగా కత్తెర పల్లి గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వసతుల గురించి ఆరా తీశారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, మండల ఉపాధ్యక్షులు విజయ్, సెల్వి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల కార్యదర్శి మహేందర్, టౌన్ కమిటి ప్రధాన కార్యదర్శి సూర్య నరసింహులు, కార్వేటి నగరం మండల కార్యదర్శి దేవా, గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.