ఉంగుటూరు, అక్టోబర్ 30 (జనస్వరం) : రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. నిడమర్రు మండలం చానమిల్లి గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను ఆశయాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని రంగాలు వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని పేర్కొన్నారు. వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, ఆక్వా రైతులు అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురై ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ప్రాంతాలవారీగా కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో సెంటిమెంట్ ను రగిలించి లబ్ధి పొందాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. చానమిల్లి గ్రామ యువత, మహిళలు, జనసైనికులు ధర్మరాజుకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఐటీ వింగ్ కో ఆర్డినేటర్ అయితం ప్రసాద్, నిడమర్రు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నిమ్మల దొరబాబు, భీమడోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ప్రత్తి మధన్, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గౌతు వెంకన్న, బేతు మురళీ, వీర మహిళ నిమ్మల మౌనిక, గరికిపాటి మణిదీప్, గరికిపాటి నాగు, గరికిపాటి తాతజీ, వెజ్జు సాయి, దొంతుకుర్తి పవన్, దూసనంపూడి మురళీ, బుర్ర పవన్, చిన్న, బేతు నరేష్ నాని, యర్రగొపు పండు, ఈలి సాగర్, వడ్డీ తిరుమల, ఈలి నాగసాయి, వెజ్జు రాజేష్, దూసనపూడి చిన్న, వెజ్జు అంజి, ములగాల జగదీష్, కడియం గణేష్, సత్య లింగోలు, అంచురి రమణ, బెతు రాజు,పాపోలు మహిందర్, అలుమోలు అరుణ్, తోట శ్రీను,తానేటి జోగేశ్వరావు, మద్దాల ఉమ, వెజ్జుబాబు నాయుడు, ఇల్లిందల సురేష్, వాకుమూడీ ఇంద్ర కుమార్,అలుమోలు రామ్ చరణ్, వాడపల్లి మధన్, లక్కకుల శ్రీను, వెజ్జు సూరిబాబు, ముదూనురి ప్రసాద్, నారాయణ నియోజకవర్గ జనసేన నాయకులు, గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com