Logo
Date of Publish : 16 December 2021, 12:02 am
Editor : Sake Naresh

ఉద్యోగులను పూర్తిగా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ! అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి

  అనంతపురం, (జనస్వరం) : ప్రభుత్వ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఒప్పందఉద్యోగుల్ని వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచేసిందని.. సీపీఎస్ అంటే ఏంటో ముఖ్యమంత్రికి కాకముందు తెలియదనే పేర్కొనడం హాస్యాస్పదమని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు విధివిధానాలకి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విధి విధానాలకి తేడా ఏమి కనబడడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పట్ల ఇద్దరూ ఒకే విధంగా నడుచుకుంటున్నారని హామీలు ఇవ్వడం, మోసం చేయడం ఈ రెండు పార్టీల విధానమని స్పష్టం అయింది అన్నారు. ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారులకు మాత్రం అప్పనంగా లక్షలకు లక్షలు దారపోయటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలని వారికి హక్కుగా ఉన్న పీఆర్సీ విషయంలో అన్యాయం చేస్తే సహించే ప్రసక్తి లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే వారంలోపే సీపీఎస్ రద్దుచేస్తానని నమ్మబలికిన ముఖ్యమంత్రి సీపీఎస్ ఉద్యోగులకు సమాధానం చెప్పాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com