పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని జనసేన నాయకులు రైతులను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షాణ జనసేన నిలుస్తుందని జనసేనపార్టీ నాయకులు మత్స. పుండరీకం, బి.పి.నాయుడు, జనసేన జాని లు అన్నారు. ఈ సంధర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్ లు చేశారు.
1.ప్రభుత్వం తక్షణమే రైతుల దగ్గర నుండి దాన్యం కొనుగోలు చెయ్యాలి.
2. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వైసీపీ ప్రభుత్వం.
3.మిలర్లతో కుమ్మకైన వైస్సార్సీపీ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
4. వైస్సార్సీపీ నాయకుల అండదండలతో 81 కేజీల బదులుగా 84 కేజీలు తీసుకుంటున్న మిలర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
5. రైతులకు ట్రక్ సీట్లు ఇవ్వటం లో వైసీపీ నాయకులుదే పై చేయిగా ఉందని, అగ్రికల్చర్ అధికారులు నామమాత్రంగా ఉన్నారని అన్నారు.
6. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న ధాన్యానికి తక్షణమే డబ్బులు చెల్లించాలి.
7. మిగులు ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
8. రైతుల పక్షాణ నిర్లక్ష్య వైకరిని చూపిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రైతులను కోరారు.
9. వారం రోజుల్లో రైతుల సమస్యలను నెరవేర్చకపోతే, రైతుల పక్షాన – జనసేన కార్యక్రమంలో చేపడతామని అన్నారు. రైతన్నల గొంతు, గోడు మీడియా ద్వారా వినిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్, వావిలపల్లి నాగభూషన్, రైతులు పాల్గొన్నారు.