నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 279వ రోజున 47వ డివిజన్ కామాటి వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు నగరంలో నివసిస్తున్న అనేకమంది స్వర్ణకారుల బ్రతుకులు కొలిమిలో కాలుతున్నాయని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమ జీవితాల్లో మార్పు రావడానికి ప్రభుత్వమే ఓ దారి చూపాలని స్వర్ణకారులు కోరుతున్నారన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్హులైన వారికి ఆర్థిక సాయం చేయాలని, నిధులు కేటాయించి స్వర్ణకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్వర్ణకారులకు వృత్తి నైఫుణ్యతను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు ప్రవేశించాక నూతన డిజైన్లను రూపొందిస్తున్నాయని, అధిక వ్యయం కారణంగా పేద స్వర్ణకారులు ఈ టెక్నాలజీని అందుకోలేక పోతున్నారని, కనుక స్వర్ణకారులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పించి వారి పురోగతికి తోడ్పడాలని అన్నారు. నెల్లూరు నగరంలో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, వైసీపీ ప్రభుత్వం తాము అడిగిన వాటిపై చిత్తశుద్ధిగా వ్యవహరించకుంటే, వచ్చే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో గెలిచి పవనన్న ద్వారా ఈ సమస్యలను పరిష్కరిస్తానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com