Logo
Date of Publish : 20 February 2023, 4:26 pm
Editor : Sake Naresh

రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారులకు 10 లక్షల రూపాయల రుణం ఇవ్వాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

          నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 279వ రోజున 47వ డివిజన్ కామాటి వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు నగరంలో నివసిస్తున్న అనేకమంది స్వర్ణకారుల బ్రతుకులు కొలిమిలో కాలుతున్నాయని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమ జీవితాల్లో మార్పు రావడానికి ప్రభుత్వమే ఓ దారి చూపాలని స్వర్ణకారులు కోరుతున్నారన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అర్హులైన వారికి ఆర్థిక సాయం చేయాలని, నిధులు కేటాయించి స్వర్ణకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్వర్ణకారులకు వృత్తి నైఫుణ్యతను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు. మల్టీ నేషనల్‌ కంపెనీలు ప్రవేశించాక నూతన డిజైన్లను రూపొందిస్తున్నాయని, అధిక వ్యయం కారణంగా పేద స్వర్ణకారులు ఈ టెక్నాలజీని అందుకోలేక పోతున్నారని, కనుక స్వర్ణకారులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పించి వారి పురోగతికి తోడ్పడాలని అన్నారు. నెల్లూరు నగరంలో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, వైసీపీ ప్రభుత్వం తాము అడిగిన వాటిపై చిత్తశుద్ధిగా వ్యవహరించకుంటే, వచ్చే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో గెలిచి పవనన్న ద్వారా ఈ సమస్యలను పరిష్కరిస్తానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com