పాలకుర్తి, (జనస్వరం) : పాలకుర్తి మండల కేంద్రములోని బొమ్మెర గ్రామములోని ఐకేపీ సెంటలోని తడిసిన రైతుల వడ్లను పరిశీలించడం జరిగింది. అనతరం మేడిద ప్రశాంత్ మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యన్ని ప్రభుత్వం ప్రకటించిన ధరకే కొనాలని డిమాండ్ చేశారు. జరిగిన ధాన్యం నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోచ్చవాలా ఆలస్యం వలననే, త్వరితగతినా కొనుగోళ్లు జరుగకపోవడం వలననే, కొనుగోలు కేంద్రాలలో వడ్లు ఎండబోసుకొని వేచి చూడడంతోనే ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలతో రైతులకు నష్టం జరిగింది. దీనికి పూర్తి భాద్యులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విధానలే కారణమని మేడిద ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు.