విజయవాడ ( జనస్వరం ) : విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ నుంచి మక్కాకి వెళ్ళాలనుకునే ముస్లింలకు 83వేల రూపాయల అదనపు భారం భరించాల్సిన పరిస్థితి వచ్చిందని, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం గాని, హజ్ కమిటీ గాని ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దారుణమని, తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్తే విమాన ఖర్చులు గాని ఇతర సౌకర్యాలకు గాని అయ్యే ఖర్చు కేవలం 3 లక్షల 5 వేల రూపాయలే అని, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే 3 లక్షల 88వేల రూపాయల ఖర్చవుతుందని ఈ 83 వేల రూపాయల అదనపు భారం వేయడం వల్ల హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు తీవ్ర ఇబ్బందులు గురవుతారని, రాష్ట్ర ప్రభుత్వం మరియు హాజ్ కమిటీ తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ 83 వేల రూపాయలు తగ్గించాలని, కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ఈ 83 వేల రూపాయల భారాన్ని భరించి రాష్ట్రం నుంచి మక్కా వెళ్లే ముస్లింలకు అండగా నిలబడాలని, రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నామని, అవినాష్ రెడ్డి గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేకసార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆంధ్రప్రదేశ్లో ముస్లింల గురించి వారి మీద పడే అదనపు భారం గురించి కనీసం కేంద్రానికి ఒక లేఖ అయినా రాస్తారో లేదో రాష్ట్రంలోని ముస్లింలకి సమాధానం చెప్పాలని, డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రంలోని ముస్లింలందరూ కూడా హజ్ యాత్ర వెళ్లడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ కే రావాలనే నిబంధనలు వలన రాష్ట్రంలోనే ఇతర ప్రాంతంలో నీ ముస్లింలు తీవ్ర ఇబ్బంది పడతారని కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిసిటీ కోసమే వారిని ఈ విధంగా ఇబ్బంది పెడుతుందని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టి 60 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామనే అంశంతో 83వేల రూపాయాల అదనపు భారం వేస్తే ఏ విధంగా ముస్లింలు మక్కా నీ సందర్శించగలరో మీరు సమాధానం చెప్పాలని దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారి మీద పడే 83 వేల రూపాయలు అదనపు భారం నుండి వారికి ఉపశమనం కలిగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి నటువంటి 102 మంది పైగా ముస్లింలకు ఆర్థిక సాయం అందించలేదని వారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని అదేవిధంగా ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు వారు వెళ్లే లోపే వారి ఖాతాలో ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com