Logo
Date of Publish : 07 September 2025, 8:37 am
Editor : Sake Naresh

గంగమ్మ ఒడికి చేరిన దేగాం గ్రామ గౌరీ పుత్రుడు

- దేగాం గ్రామ ప్రజలు సుమారు 17 విగ్రహాలను నిమజ్జనం చేశారు.

- ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన డీజేలకు ఎస్సై శంకర్ అనుమతి ఇవ్వలేదు.

- ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం.

- “బై బై గణేశా” అంటూ ఘనంగా వీడ్కోలు పలికిన దేగాం గ్రామ ప్రజలు.

భైంసా, సెప్టెంబర్ 06 (జనస్వరం): దేగాం గ్రామంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు చివరకు గంగమ్మ ఒడిలోకి చేరారు. భక్తజనుల కోలాహలం మధ్య “గణపతి బప్పా మోరియా” నినాదాలు వినిపించాయి. “వెళ్లిరా గణపయ్య – మళ్లీ రావయ్యా” అంటూ గణేశుడిని భక్తులు సాగనంపారు.

ఆద్యంతం కన్నుల పండువగా సాగిన శోభాయాత్రలో జనం తండోపతండాలుగా పాల్గొన్నారు. గణేశుడికి వీడ్కోలు పలికేందుకు పక్క గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు. దీంతో గ్రామంలోని రహదారులు రద్దీగా మారాయి. చివరి సారి భక్తులు లంబోదరుడికి దర్శనమిచ్చారు.

శోభాయాత్ర మార్గం:
పాత హనుమాన్ గల్లి → గ్రామ పంచాయతీ → ఆర్టీసీ బస్టాండ్ → ముదిరాజ్ సంఘం → విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు శోభాయాత్ర కొనసాగింది.

ఐదు రకాల అన్నదానం:
నిమజ్జన సందర్భంలో సాయిబాబా ఆలయంలో వచ్చిన భక్తులకు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. 5 క్వింటాళ్ల బియ్యం, పెసర పప్పు, వంకాయ కూర, పాయసం వండి భక్తులకు వడ్డించారు.

డీజేలు నిషేధం – ఎస్సై శంకర్:
అధిక శబ్దం కలిగించే డీజేలకు, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బాణచంచా, లేజర్ లైట్లు, డీజే వాహనాలపై కాగితాలు విసిరే మోటార్ల వినియోగాన్ని కూడా నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్సై శంకర్ హెచ్చరించారు. భక్తి పాటలతో మహిళలు, పురుషులు, చిన్నారులు కలసి నృత్యాలు చేస్తూ “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com