Logo
Date of Publish : 22 February 2023, 3:16 am
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వంలో కుదేలైన చిరు వ్యాపారస్తులు

- పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 281వ రోజున 47వ డివిజన్ కామాటి వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాటు కోవిడ్ ఇబ్బందులు తదనంతర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహకాలు, సాయం లేకపోవడంతో చిరు వ్యాపారస్తులు అనేకమంది కుదేలయ్యారని అన్నారు. ఏ ఒక్కరిని పలుకరించినా అప్పుల బాధలు చెప్తున్నారని అన్నారు. కొందరికి బ్యాంకుల్లో అప్పుల కోసం ఐటీ దాఖలు చేసినట్లు చూపితే, దాన్ని సాకుగా చూపి రేషన్ కార్డులు రద్దు చేసి సంక్షేమ పథకాలు కూడా రాకుండా చేసారని అన్నారు. ప్రజలను అన్ని రకాలుగా మానసిక వేదనలకు గురిచేస్తున్న ప్రభుత్వం ఇది అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే షణ్ముఖ వ్యూహాన్ని రూపొందించారని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com