Logo
Date of Publish : 24 June 2023, 5:49 pm
Editor : Sake Naresh

నెల్లూరు సిటీలో వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది

       నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 308వ రోజున 9వ డివిజన్ నవాబుపేట FCI కాలనీలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా తయారైందో ప్రతిఒక్కరికి అర్థమైపోయిందన్నారు. నగరాన్ని ఏమాత్రం కనీస అభివృద్ధి కూడా చేయకుండా నిర్వీర్యం చేయడం వల్లే వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా నియోజకవర్గంలో ప్రజలందరూ గాజుగ్లాసు గుర్తుకి ఓటు వేసి తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, పవనన్న ప్రజాబాటకు వస్తున్న అపూర్వ స్పందనే అందుకు నిదర్శనం అని అన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, పవనన్న ప్రభుత్వంలో నెల్లూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com