
నెల్లూరు ( జనస్వరం ) : ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది అంటూ… 50 వ డివిజన్ జనసేన కార్యకర్త అలేఖ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ డోర్ టు డోర్ జనసేన ప్రచారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా జగన్ అయోమయ పరిస్థితిని రాష్ట్ర తిరోగతిని చూడలేక ఎమ్మెల్యే పదవిలో ఉండగానే పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన ప్రణాళికలు లేని జగన్ ప్రభుత్వం వల్ల ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిపోతుంది,ఏ రంగం వారు కూడ సంతోషంగా లేరు రానున్న రోజుల్లో వైసీపీ తరఫున ప్రజలకు న్యాయం చేయలేమని భావించి ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని సార్వత్రిక ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగనున్న జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి గాజు గ్లాస్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు 50 డివిజన్ జనసేన కార్యకర్త అలేక్, ప్రశాంత్ గౌడ్, కంథర్, అమీన్, హేమచంద్ర యాదవ్, చిన్నరాజా, షాజహాన్, ఇంతియాజ్, ప్రతాప్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.