● భారీగా తరలివచ్చిన జనసేన నాయకులు
● సంఘీభావం తెలిపిన ప్రజలు, చిరు వ్యాపారులు
అనంతపురం, (జనస్వరం) : నగర ప్రజల జీవన ప్రమాణాలను విస్మరించి పెంచిన ఆస్తి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాలు మేరకు నగర అధ్యక్షులు పొదిలి బాబు రావు ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన నగరపాలక సంస్థ ముట్టడి విజయవంతం అయింది. జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో నగర ప్రజలు, చిరు వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పన్నులు చెల్లింపునకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో అనంత నగర ప్రజల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఇలాంటి తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలపై పన్ను, వడ్డీ భారాన్ని మోపడాన్ని జనసేనపార్టీ తరపున వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆస్తి విలువ ఆధారిత విలువ పన్నును తగ్గించాలన్నారు. పన్ను పై వడ్డీని ఒక రూపాయి లోపు పరిమితం చేయాలన్నారు. కరోనా, కరవు నేపథ్యంలో పన్ను ఒత్తిడిని తగ్గించాలన్నారు. సచివాలయ, వాలెంటరీ వ్యవస్థల ద్వారా పదే పదే పన్నులు కట్టమని ప్రజలను వేధించడం దుర్మార్గపు చర్య అన్నారు. పన్నుల విషయంలో పార్టీల పక్షపాతం సబబు కాదని అభివృద్ధి చేయకుండా ప్రజలపై భారాలు మోపడం హేయమన్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని భవిష్యత్తులో జనసేన పార్టీ ఈ నిరంకుశ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు ఇండ్ల కిరణ్ కుమార్, రాపా ధనుంజయ్, సంజీవ రాయుడు, సంయుక్త కార్యదర్శులు విజయ్ కుమార్, పురుషోత్తం రెడ్డి, జయమ్మ, వీరమహిళ రూప, అర్బన్ నాయకులు రోళ్ల భాస్కర్, మేదర వెంకటేష్, ఎంవీ శ్రీనివాస్, వెంకటనారాయణ, ముప్పూరి కృష్ణ, విశ్వనాథ్ జనసేన, హరీష్, ధరాజ్ భాష, సంపత్, సంతోష్, ఆకుల ప్రసాద్, మల్లి, నారాయణపురం నాయకులు చిరు, నాగార్జున, అశోకు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.