Logo
Date of Publish : 01 August 2026, 7:27 pm
Editor : Sake Naresh

సువార్త సేవకుల సేవలు చిరస్మరణీయం

సువార్త సేవకుల సేవలు చిరస్మరణీయం

సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో రెవ. డా. జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హాయ్యర్ సేవల స్మరణ

చీరాల, ఆగస్ట్ 01( జనస్వరం).

సువార్త ప్రచారంతో పాటు విద్య, వైద్య సేవలను ప్రజలకు అందించాలనే మహోన్నత సంకల్పంతో జీవితాన్ని అంకితం చేసిన సువార్త సేవకుల సేవలు సమాజానికి ఎప్పటికీ మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సువార్త పరిచర్యకు పునాది వేసిన తొలి లూథరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హాయ్యర్ సేవలను స్మరించుకుంటూ స్థానిక సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు వేముల డానియల్ ఐజాక్ సన్ కళాశాలకు రెవ. డా. జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హాయ్యర్, డాక్టర్ మార్టిన్ లూథర్ చిత్రపటాలను బహూకరించారు.అనంతరం కళాశాల కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్, ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ నాని బాబు మాట్లాడుతూ సుమారు 185 సంవత్సరాల క్రితం గుంటూరు ప్రాంతంలో ప్రారంభమైన లూథరన్ సువార్త సేవలు విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయని తెలిపారు. రెవ. డా. జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హాయ్యర్, డాక్టర్ మార్టిన్ లూథర్ సమాజానికి అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశయాలను ప్రతి విద్యార్థి తెలుసుకుని ఆచరణలో పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గారపాటి మంజులదేవి,షిపోరా, సుమ, చిన్నపాప, శివపార్వతి, డాక్టర్ జాస్మిన్ గోల్డ్, కృష్ణవేణి,రాధిక, అధ్యాపకేతర సిబ్బంది వినీల, నీలిమ, జార్జి విన్సెంట్,అక్తరున్నిసా, జ్యోతితో పాటు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com