Logo
Date of Publish : 23 November 2025, 9:32 am
Editor : Sake Naresh

మహారాణి బుచ్చి సీతాయమ్మ సేవలు చిరస్మరణీయం …!

* ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

* 400 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
* సభికులు అందరికీ అన్న సమారాధన

శంఖవరం, నవంబర్ 22 (జనస్వరం) ;

కాకినాడ జిల్లా పెద్దాపురం సంస్థానం మహారాణి శ్రీ రాజా వత్సవాయి రాణి బుచ్చి సీతాయమ్మ బహదూర్ ను 190 సంవత్సరాల తర్వాత కూడా ఇంత ఘనంగా స్మరించుకుంటూ ఉన్నామంటే ఆమె జన్మ చరితార్ధం అయ్యిందని, ఆమె సేవలు, చరితం ఎప్పటికీ చిరస్మరణీయమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కీర్తించారు.‌ ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి సేవలను స్మరించుకుంటూ వారి ఉదాత్త వ్యక్తిత్వం గురించి చెప్పుకుంటూ ఉంటుంటే ఆ వ్యక్తి మరణించినా కూడా అమరుడని, వారి జన్మ సార్థకం అవుతుందని ఎమ్మెల్యే సత్యప్రభ వివరించారు.‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణా సారధ్యంలో నియోజక వర్గంలోని శంఖవరం మండలం కత్తిపూడిలోని బుచ్చి సీతాయమ్మ ధర్మసత్రంలో సీతాయమ్మ 190 వ వర్ధంతి వేడుకలను శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఘనంగా నిర్వహించారు. తొలుత ధర్మసత్రం ప్రాంగణంలో సీతయ్యమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే సత్యప్రభ జ్యోతి ప్రజ్వలనం చేసారు. ఎమ్మెల్యే, ధర్మ సత్రం పాలక మండలి అధ్యక్షుడు సోమరౌతు చంద్రమౌళి, మిగతా సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు సీతాయమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి ఆమెను స్మరించుకుంటూ ఘనంగా నివాళులను అర్పించారు. అనంతరం పాలక మండలి అధ్యక్షుడు సోమరౌతు చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించిన సీతాయమ్మ వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభ ప్రసంగించారు.‌ సీతాయమ్మ సేవలను స్మరించుకుంటూ ఇంత వైభవంగా ఆమె వర్ధంతి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించు కోవడం ఆనందదాయకం అన్నారు. నాడు సీతాయమ్మ ఏ ఆశయంతో ఈ ధర్మ సత్రాన్ని ఏర్పాటు చేసి యాత్రీకులు, బాటసారులు, విద్యార్థులకు నిత్యాన్నదాన సౌకర్యం, ఇతర సదుపాయాలను కల్పించారో ఆ ఆశయం నెరవేందుకు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ సక్రమంగా అమలుపరుస్తూ ముందుకు నిర్వహిస్తూ ఉంటేనే సీతాయమ్మ నాటి త్యాగానికి నేటికీ కూడా నిజంగా విలువ ఉంటుందని, ఆమె సేవలు అజరామరం అవుతాయని ఎమ్మెల్యే సత్యప్రభ హితోపదేశం దేశం చేసారు. ధర్మ సత్రానికి శంఖవరం, రౌతులపూడి మండలాల్లో ఉన్న భూములను కౌలుకు ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయ వనరులతో ఇప్పటికీ కూడా సీతాయమ్మ పేరున ధార్మిక సేవలను సక్రమంగా కొనసాగించడం అబినందనీయం అన్నారు. ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పధకంలో ప్రతీ నెలా 9 వ తేదీన శంఖవరం, పెదమల్లాపురం, రౌతులపూడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీ స్త్రీలకు నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాల్లో ఆరోగ్య పరీక్షలను చేయించుకున్న మహిళలకు, వారి సహాయకులకు మధ్యాహ్నం పూట ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించాలని సత్రం అధ్యక్షుడు సోమరౌతు చంద్రమౌళి, పాలకవర్గం చేసిన ప్రతిపాదన అమలుకు తన వంతు సంపూర్ణ మద్దతు, సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన అంగీకారాన్ని తెలిపారు. రాష్ట్ర టిఎన్.టి.యు.సి. ఉపాధ్యక్షుడు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల తెలుగు దేశం పార్టీ పూర్వ ప్రచార కార్యదర్శి పర్వత సురేష్, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్, తెలుగు దేశం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బద్ది రామారావు ప్రసంగించారు.‌ ఈ సందర్బంగా సత్రం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోమరౌతు చంద్రమౌళి, పాలకవర్గం సభ్యులు గజ్జి వరలక్ష్మి, ఉమ్మి వనలక్ష్మి, చిట్రా శివభవాని, గవిరెడ్డి నాగలక్ష్మి, కామారెడ్డి కాశీ, దేవులపల్లి ఎన్వీఎస్ ప్రకాష్, పక్కుర్తి సతీష్, పెండ్యాల బేబీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సత్రం కార్యనిర్వహణ అధికారి యర్రా వెంకటేశ్వర్రావు పర్యవేక్షణలో 400 మందికి అన్నదానం, వస్త్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ), ఇదే పార్టీ కాకినాడ జిల్లా కార్యనిర్వహణా కమిటీ సభ్యులు, తుని ప్రాంతీయ "ఆత్మ" కమిటీ ఉపాధ్యక్షుడు కరణం సుబ్రహ్మణ్యం, రౌతులపూడి మండల ప్రజా పరిషత్తు మాజీ అధ్యక్షుడు ఇటంశెట్టి సూర్య భాస్కర్, శంఖవరం మండల మాజీ ఉపాధ్యక్షుడు బొమ్మిడి సత్యనారాయణ, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com