● అప్పుడు అవినీతిపరుడు ఇప్పుడెలా నాయకుడు అవుతాడు?
● దశాబ్దాల పాటు పదవుల్లో ఉండి ఉత్తరాంధ్రకు చేసిందేమిటి?
● పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం అడ్డుకుంటామని చెప్పడం అవివేకం
● రాష్ట్రానికి ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకురావడం మంత్రికి చేతకాదు
● మూడు రాజధానులపై వైసీపీవి దొంగ నాటకాలు
● విశాఖ భూ కుంభకోణాలపై సిట్ రిపోర్ట్ బయట పెట్టి గర్జనలు చేసుకోండి
● పవన్ కళ్యాణ్ పర్యటనను సమష్టిగా విజయవంతం చేద్దాం
● జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
హైదరాబాద్, (జనస్వరం) : ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ వేదికగా నేను స్పీకర్ గా ఉన్న సమయంలోనే జగన్ రెడ్డి అవినీతిని తూర్పూరబట్టిన ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు ఇప్పుడు అందుకు భిన్నంగా పదవులను కాపాడుకోవడం కోసం అదే వ్యక్తిని పొగడటం విడ్డూరమని జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ఆలోచిస్తాడు. తన సొంతం కోసం ఎలా మాట్లాడతాడు. సామాన్యుడిని ఎందుకు పట్టించుకోడనే విషయాలపై లోతుగా మాట్లాడిన ఇద్దరు నేతలు ఇప్పుడు వింతగా మాట్లాడుతున్నారని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘ముందుగా చెప్పినట్లుగా జనవాణి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర పరిధిలో విశాఖలో నిర్వహిస్తున్నాం. దీన్ని వాయిదా వేసుకోవాలని, ఆపాలని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జనవాణి కార్యక్రమం గురించి వారికి అంతగా తెలిసి ఉండదు. వందల కిలోమీటర్ల నుంచి వచ్చి జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి మహిళలు, దివ్యాంగులు, పేదలు వస్తున్నారు. ఆయనకు తమ సమస్యను చెబితే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి బయటకు వస్తుందని భావిస్తున్నారు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ఆపాలని కోరడం వివేకం కాదు. దీన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ప్రభుత్వం పరిష్కరించని ఎన్నో సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. దాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా విని, వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖలకు లేఖలు రాస్తున్నారు. ఇదో గొప్ప ప్రజా కార్యక్రమమని తెలిపారు.