
ఎమ్మిగనూరు, (జనస్వరం) : శ్రీ కృష్ణదేవరాయలను స్ఫూర్తిగా తీసుకొని పాలన కొనసాగించాలని జనసేన రాష్ట్ర మహిళ సాధికారత చైర్మన్, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంఛార్జ్ జె. రేఖ అన్నారు. స్థానిక కర్నూలు నగరంలోని కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద ఆ మహానుభావునికి జనసేన జిల్లా పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జె.రేఖ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలంలో దక్షిణ భారతదేశమంతా ఏలాంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా పరిపాలన కొనసాగిందని, అలాంటి పరిపాలన కోసం నేటి రాజకీయ నాయకులు పాలకులు కృషి చేయాలని కోరారు. కృష్ణదేవరాయలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు వ్యవసాయానికి సాగునీటిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్, పూజల రాంభూపాల్ రెడ్డి, నాగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.