●దమ్ముంటే మూడు రాజధానుల రెఫరెండంతో ఎన్నికలకు రావాలి
● ఏలూరు జనసేనపార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సవాల్
ఏలూరు, (జనస్వరం) : జగన్ రెడ్డి పాలనలో రౌడీ మూకలు అరాచకాలు సృష్టిస్తూ పేట్రేగిపోతున్నాయని జనసేనపార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. టెక్కలి నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. యధా రాజా తధా ప్రభు అన్న చందంగా ముఖ్యమంత్రి రెచ్చగొడుతుంటే ఆ పార్టీ గూండాలు దాడులకు తెగబడుతున్నారన్నారు. శనివారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి మాట్లాడితే ప్రజలు ఎక్కడ తమ ప్రభుత్వంపై తిరగబడతారోనన్న భయంతో మహిళా లోకాన్ని కించపర్చే విధంగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అవనిగడ్డ సభ సాక్షిగా పచ్చి అబద్దాలు ఆడారని మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. మీరు చెబుతున్నట్టు మీకు ప్రజా బలం ఉంటే మూడు రాజధానులు రెఫరండంగా ఎన్నికలకు రావాలని సవాలు చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రవి, నాయకులు కందుకూరి ఈశ్వరరావు, రాచప్రోలు వాసు, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com