Logo
Date of Publish : 06 February 2022, 4:53 pm
Editor : Sake Naresh

కోవూరు నియోజకవర్గంలో రహదారి కల్వర్టును స్వంత నిధులతో నిర్మించిన జనసైనికులు

           నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు నియోజకవర్గం పరిధిలోని విడవలూరు మండలం, తుమ్మగుంట అనే గ్రామం నుంచి వావిళ్ళ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి లో గతంలో ఒక కల్వర్టు నిర్మించడం జరిగింది. ఈ కల్వర్టు దగ్గర రోడ్డు కొంత కాలానికే కుంగిపోయి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ సమస్యని అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో తలపెట్టిన #JSPFOR_AP_ROADS అనే నినాదంతో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాధ్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, గ్రామస్థులతో కలసి శ్రమాధానంతో రోడ్డుని బాగుచెయ్యడం జరిగింది. శ్రీనాధ్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం పనిచెయ్యాలని.. రోడ్లు బాగలేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తున్నారని... ప్రజల క్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే జనసేనపార్టీ పనిచేస్తుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులురెడ్డి, నాగేంద్ర, రాము, శ్రీను, శివ, శ్రీకాంత్, వర్మ, కోవూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు అల్తాఫ్, సాయి, పవన్, ఏసురాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com