
నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు నియోజకవర్గం పరిధిలోని విడవలూరు మండలం, తుమ్మగుంట అనే గ్రామం నుంచి వావిళ్ళ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి లో గతంలో ఒక కల్వర్టు నిర్మించడం జరిగింది. ఈ కల్వర్టు దగ్గర రోడ్డు కొంత కాలానికే కుంగిపోయి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ సమస్యని అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో తలపెట్టిన #JSPFOR_AP_ROADS అనే నినాదంతో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాధ్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, గ్రామస్థులతో కలసి శ్రమాధానంతో రోడ్డుని బాగుచెయ్యడం జరిగింది. శ్రీనాధ్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం పనిచెయ్యాలని.. రోడ్లు బాగలేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తున్నారని… ప్రజల క్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే జనసేనపార్టీ పనిచేస్తుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులురెడ్డి, నాగేంద్ర, రాము, శ్రీను, శివ, శ్రీకాంత్, వర్మ, కోవూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు అల్తాఫ్, సాయి, పవన్, ఏసురాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.