పార్వతీపురం ( జనస్వరం ) : పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితీలో నిధులు దుర్వినియోగ పరిచిన కార్యదర్శి, సర్పంచ్ లతో రికవరి నిధులను కట్టించాలని పార్వతీపురం మండల జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. పెదమరికి పంచాయతి కార్యదర్శి, సర్పంచ్ లను సస్పెండ్ చేసి మరలా విధుల్లోకి చేర్చినట్లయితే సమాజం తప్పు త్రోవ పడుతుందని, కావున వారిచే రికవరి నిధులను కట్టించి శాస్వితంగా విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు మండల అధ్యక్షురాలు ఆగురు మణి, బొనెల గొవింధమ్మ,రాజాన బాలు, ఖాతా విశ్వెశ్వరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్, కర్రి మణికంఠ, బొండపల్లి జనార్థరావు, జనసైనికులు, వీరమహిళలు పెదమరికీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com