నెల్లూరు ( జనస్వరం ) : సూపరిటెండ్ అఫ్ పోలీసు కార్యాలయంలో రౌతు వినయ్ గురించి కేసు కట్టవలసినదిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం లో ఆత్మహత్య చేసుకున్న రౌతు వినయ్ కుటుంబ సభ్యులు గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా కేసు కట్టి దోషులను శిక్ష పడేవిధంగా చర్యలు ఏమి తీసుకోలేదు. స్వామి మాల వేసుకున్న వినాయ్ ని కొట్టింది నలుగురు ముస్లిమ్స్ దీనిని కొంతమంది మత తగాదాగా సృష్టించడానికి చూస్తున్నారు. వీలైనంత త్వరగా విచారించి కేసు కట్టి ఇటువంటి అభిప్రాయాలకు స్వస్తి పలకవలసిందిగా అవసరం ఎంతైనా ఉంది అని గుర్తుచేసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకులు కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, శరవణ, మౌనిష్, వర్షన్, కేశవ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com