
– పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
– సామాన్య ప్రజలకు జగన్ అన్న కరెంటు షాకు పథకం
– జగన్ పాలనలో ప్రజలపై రూ.40 వేల కోట్ల భారం
– విసనకర్రలు విసురుకుంటూ వినూత్న నిరసన
– పేద సామాన్య వర్గాలు రోజుకు ఒక యూనిట్ వాడాలా? సీఎం జగన్
– నవరత్నాలు కాదు నవ పన్నుల బాదుడు పథకాలు అని పేరు పెట్టండి
– సీఎం జగన్ అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ బాదుడు మొదలైంది అని అర్థం
– జనసేన అధినేతపవన్ కళ్యాణ్‌తోనే ప్రజా సమస్యలకు పరిష్కారం
– విద్యుత్ ఛార్జీల పెంపు రొటీన్ అయింది
– జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పేద సామాన్య వర్గాలకు భారమైన విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ లెనిన్ సెంటర్ వద్ద జనసేన పార్టీ విజయవాడ ఆధ్వర్యంలో విసనకర్రలు విసురుకుంటూ వినూత్న నిరసన కార్యక్రమం నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు రాష్ట్రంలో రొటీన్ అయిపోయిందని, 3 సంవత్సరాల్లో 40 వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రజలపై మోపరని, అందుకే జగన్ అన్న కరెంటు షాక్ పథకం అని ప్రజలు ఈ భారం మోయలేక వాపోతున్నారన్నారు. పేద సామాన్య ప్రజలకు ప్రతి యూనిట్‌కు రూ.45 పైసల నుంచి రూ.1.57 పైసల భారం పడిరదని దీనికి అదనంగా సర్దుబాటు చార్జీలు వేశారని ప్రజలు మోయలేని భారం వేసిన ఈ ప్రభుత్వానికి సాగనంపడం మాత్రమే ఇక మిగిలిందని, ఎండాకాలంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉన్న సమయంలో కావాలనే చార్జీలను, స్లాబులను మారుస్తున్నారన్నారు. తద్వారా పేద సామాన్య వర్గాల జేబులు కొల్లగొడుతున్నారని, ఫ్యానుకు ఓటు వేసిన పాపానికి నేడు రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి ఏర్పడిరదని, ఇక రాబోయే రోజుల్లో ప్రజలు విసినకర్ర విసురుక్కునే దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని, ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును రద్దు చేయకపోతే ప్రజలు ఈ ప్రభుత్వాన్నీ కృష్ణానదిలో కలిపి వేయడం ఖాయమని, రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు లేదని నవ పన్నుల బాదుడు పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. బాదుడే బాదుడుకు అసలైన నిర్వచనం జగన్ ప్రభుత్వమని, శుక్రవారం జగన్ ప్రవేశపెట్టిన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం ఉపేంద్ర కూడా జగన్‌కి అర్హత లేదని సొంత తల్లి విజయమ్మకు, సోదరి షర్మిలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తని ఏ వాహనం లేకుండానే వారిని తెలంగాణకు సాగనంపిన ఘన చరిత్ర కలిగిన జగన్‌కి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించి అర్హత లేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు దుర్మార్గమని, ప్రజలు ఈ భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఉన్నారని, విద్యుత్ చార్జీలు తగ్గించెంతవారకు వరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తుందని, ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలు తగిన మూల్యం చెల్లించుకున్నారని, రాష్ట్రంలో అనేక రకాలైన పన్నులు ప్రజలపై వేసి భారాలు మోపుతున్నారని, ప్రజావ్యతిరేక విధానాలు పన్నుల భారాలు మోపుతున్న వైసీపీకి అతి తొందరలోనే అధికారం దూరమవుతుందని హెచ్చరించారు. విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి మోబినా మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలు పన్నుల భారాన్ని మోయలేక పోతున్నారని, ప్రతి ఏడాది విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్నారని, ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని, జగన్ వేసే పనులకు ఇకనుంచి ఇంటిల్లపాది పనిచేసే దుర్భర పరిస్థితి ఏర్పడిరదని, తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయకపోతే మహిళలు జగన్ ప్రభుత్వాన్ని దించడం ఖాయమన్నారు. విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి డి. నాగేష్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు దుర్మార్గమని, పేద సామాన్య వర్గాలు కట్ట లేనివిధంగా భారాలు మోయలేనంతగా ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ఉందని, తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు విధించిన ట్రూ చార్జీలు, మార్చిన స్లాబ్ లను రద్దు చేయకపోతే ఉపేక్షించేది లేదని, రద్దు చేసేంతవరకు ఈ ఉద్యమం ఆగదని జనసేన పార్టీ పేద సామాన్య వర్గం తరపున పోరాడి వారికి న్యాయం చేస్తుందన్నారు. కృష్ణా-పెన్నా మహిళా కమిటీ సభ్యులు రావి సౌజన్య మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీల తక్షణమే రద్దు చేయాలని, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని ఈ ప్రభుత్వం పతనం అవుతుందని హెచ్చరించారు. కృష్ణా-పెన్నా మహిళా కమిటీ సభ్యులు మల్లెపు.విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు సామాన్య ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోందని, ప్రతి కుటుంబం పై ఈ భారం తీవ్రమైన ప్రభావం చూపుతుందని సామాన్యుడు ఏవిధంగా ముప్పై యూనిట్లతో ఇకనుంచి విద్యుత్ వినియోగించాలో జగన్ ప్రజలకు వివరించాలని, పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించకపోతే పవన్ కళ్యాణ్ ప్రజా ఉద్యమంతో ఈ ప్రభుత్వం పతనం శాసిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, రాష్ట్ర చేనేత కార్యదర్శి నెమల సంజీవరావు, నగర ఉపాధ్యక్షులు వెన్నా శివ శంకర్, కమలా రామనాథం, నగర కార్యదర్శిలు శనివారపు. శివ, బొట్ట సాయి కుమార్, కొర్ర గంజి వెంకటరమణ, వేవిన్ నాగరాజు, పులసి దుర్గా రాణి, పాల రజిని, ఆలియా బేగం, సంయుక్త కార్యదర్శులు ఎస్.నరేష్, ఆకారపు విజయ్ కుమారి, డివిజన్ అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు, రెడ్డి పల్లి గంగాధర్, బొమ్మ రాంబాబు, సిగినం శెట్టి రాము, ఏలూరు శరత్, జల్లి రమేష్, దోమకొండ మేరీ, వేముల వెంకటేష్, హరి ప్రసాద్, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు, రేవడి రమాదేవి, శివరామకృష్ణ, పుల్లారావు, తమ్మైన రఘుబాబు, నగర అధికార ప్రతినిధులు, ఎస్‌కే గయ్యసుద్దిన్, ఎం. తిరుపతి నాయుడు, సయ్యద్ అబ్దుల్ నజీబ్ ముఖ్య నాయకులు స్టాలిన్, బావి శెట్టిశ్రీను, రాజా నాయుడు, మరుపిళ్ళా చిన్నారావు, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ధర్నా ముగించిన అనంతరం నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనిత, విజయవాడ నగర ఉపాధ్యక్షులు వెన్న. శివశంకర్, కామల్లా సోమనాథం నగర ప్రధాన కార్యదర్శి డి నాగేష్, నగర కార్యదర్శి శనివారపు.శివ, 39వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు.సాయి శరత్, 50వ డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి, గంగా తదితరులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ శ్రీనివాస రెడ్డికి పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.