భట్టిప్రోలు ( జనస్వరం ) : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ 20వ తేదీ బుధవారం విజయనగరం జిల్లా పోలిపర్ల లో జరిగే సభకు జననేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో జనసైనికులు యువగళం ముగింపు సభకు తరలిరావాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతూ అనురాధ తెలియజేశారు. మంగళవారం వేమురులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జరిగే భారీ సమావేశాలకు ఇరు పార్టీ నాయకులు హాజరవుతారని, యువగళం ముగింపు సభకు జననేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కలిసి ఉమ్మడి వేదికగా హాజరవుతున్న దృష్ట్యా జన సైనికులు సభ కు తరలి రావాలని పిలుపునిచ్చారు. వేమురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసైనికులు కూడా యువగళం సభకు రావాలని ఆహ్వానిచ్చినట్టు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆహ్వానం మేరకు జన సైనికులు బహిరంగ సభకు తరలిరావాలని సోమరౌతూ అనురాధ పిలుపునిచ్చారు.